: నరేష్ అంటే ఎవరో తెలియని చోటకు వెళ్లి చిన్ని బిజినెస్ చేయాలని ఉంది: అల్లరి నరేష్


‘ఒక పది, పదిహేనేళ్ల తర్వాత.. నరేష్ అంటే ఎవరో తెలియని చోటకువెళ్లిపోయి ఒక రెండేళ్ల పాటు అక్కడ చిన్న బిజినెస్ చేసుకోవాలని ఉంది’ అని ఒక ప్రశ్నకు అల్లరి నరేష్ సమాధానమిచ్చాడు. కొన్నేళ్లు అలా వేరే దేశంలో ఉండటం తనకు ఇష్టమని... ఇప్పుడే కాకపోయినా, పది పదిహేనేళ్ల తర్వాత ‘నరేష్’ అంటే తెలియని చోటుకు వెళ్లి ఒక చిన్న బిజినెస్ ను కొన్నేళ్లపాటు చేస్తానని అన్నాడు. తనకు ఇష్టమైన ప్రదేశం యూరోప్ అని, నచ్చిన ఫుడ్ విషయానికొస్తే.. ఇంట్లో అయితే, చేపల ప్రై, బెండకాయ పులుసు... అదే బయట అయితే, థాయ్ ఫుడ్ బాగా ఇష్టపడతానని నరేష్ చెప్పాడు. పైచదువుల కోసం విదేశాలకు వెళ్లమని తన తండ్రి ఈవీవీ సత్యనారాయణ తనకు ఎప్పుడూ చెబుతుండేవారని, అయితే, తాను మాత్రం ఎప్పుడు ఇండస్ట్రీలోకి వద్దామా అనే ఆలోచించే వాడినని నరేష్ నవ్వుతూ చెప్పాడు.

  • Loading...

More Telugu News