: ఎవరడ్డుపడ్డా ‘పాలమూరు’ ఆగదు: మంత్రి హరీష్ రావు
ఎవరడ్డుపడ్డా పాలమూరు ఎత్తిపోతల పథకం ఆగదని తెలంగాణ మంత్రి హరీశ్ రావు అన్నారు. మహబూబ్ నగర్ జిల్లాలోని మురారిదొడ్డి గ్రామంలో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ, తెలంగాణలో ప్రాజెక్టులు నిర్మించి రైతులకు సాగునీరందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుంటే, ప్రతిపక్షాలు మాత్రం అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్నాయని విమర్శించారు. పెండింగ్ లో ఉన్న నాలుగు ప్రాజెక్టులను ఈ ఖరీఫ్ సీజన్ లోగా పూర్తి చేస్తామని చెప్పారు. పాలమూరు ఎత్తిపోతల పథకంతో మహబూబ్ నగర్ జిల్లా సస్యశ్యామలమవుతుందని హరీశ్ రావు అన్నారు.