: కృష్ణా పుష్కరాలను బహిష్కరిస్తాం: బాబు సర్కారుకు పీఠాధిపతుల హెచ్చరిక
విజయవాడ పరిసర ప్రాంతాల్లో రహదారుల విస్తరణ పేరిట పలు దేవాలయాలను కూల్చివేయడాన్ని పలు పీఠాధిపతులు తీవ్రంగా ఖండించారు. ఈ ఉదయం విజయవాడలో సమావేశమైన పీఠాధిపతులు, తక్షణం కూలగొట్టిన చోటనే విగ్రహాలను ప్రభుత్వ ఖర్చుతో తిరిగి ప్రతిష్ఠించాలని, గుడులను నిర్మించాలని డిమాండ్ చేశారు. లేకుంటే కృష్ణా పుష్కరాలను బహిష్కరిస్తామని హెచ్చరించారు. ప్రభుత్వం ఆలయాలను తొలగించిన తీరు అత్యంత బాధాకరమని, దీనిని నిరసిస్తూ, రేపు విజయవాడలో పీఠాధిపతులంతా కలిసి ప్రదర్శన చేపట్టనున్నామని శైవ క్షేత్ర పీఠాధిపతి శివస్వామి వెల్లడించారు.