: బేగంపేటలో పేకాడుతూ పోలీసులకు దొరికిపోయిన మాజీ ఎమ్మెల్యే ఈలి నాని
హైదరాబాద్, బేగంపేటలోని హరిత ప్లాజాలో పేకాట ఆడుతున్నారన్న పక్కా సమాచారంతో దాడులు చేసిన టాస్క్ ఫోర్స్ పోలీసులకు తాడేపల్లి గూడెం మాజీ ఎమ్మెల్యే ఈలి నాని దొరికిపోయారు. పలువురు పేకాటరాయుళ్లను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారి నుంచి రూ. 5 లక్షలకు పైగా నగదు, పలు కార్లు స్వాధీనం చేసుకున్నారు. డబ్బు, వాహనాలను పంజాగుట్ట పోలీసులకు అప్పగించారు. అరెస్ట్ చేసిన వారిని కోర్టు ముందు ప్రవేశపెడతామని పోలీసు అధికారులు తెలిపారు. అరెస్ట్ సమయంలో ఈలి నాని తన ముఖాన్ని అడ్డుపెట్టుకుని పోలీసు వాహనం ఎక్కారు.