: వేతన పెంపు చాలదు... 11 నుంచి దేశవ్యాప్త సమ్మెకు దిగనున్న 33 లక్షల మంది కేంద్ర ఉద్యోగులు
7వ వేతన సంఘం సిఫార్సుల మేరకు పెంచిన వేతనాలు తమకు సరిపడవంటూ, 33 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు 11వ తేదీ నుంచి సమ్మెకు దిగనున్నారు. "రూ. 7 వేలుగా ఉన్న బేసిక్ ను 2.57 ఫిట్ మెంట్ ఫార్ములా ప్రకారం రూ. 18 వేలుగా చేశారు. పెరిగిన ఖర్చులతో పోలిస్తే, ఇది చాలా తక్కువ. మేము 3.68 ఫిట్ మెంట్ ఫార్ములాను అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. అందుకోసం సమ్మెకు దిగనున్నాం" అని ఆల్ ఇండియా రైల్వే మెన్ ఫెడరేషన్ కార్యదర్శి, నేషనల్ జాయింట్ కౌన్సిల్ ఆఫ్ యాక్షన్ (ఎన్జేసీఏ) కన్వీనర్ శివగోపాల్ మిశ్రా వెల్లడించారు. కాగా, ఎన్జేసీఏ ఆరు ప్రభుత్వ ఉద్యోగాల యూనియన్ జాయింట్ కమిటీ. ఇందులో కాన్ఫెడరేషన్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయిస్, ఆల్ ఇండియా డిఫెన్స్ ఎంప్లాయీ ఫెడరేషన్, నేషనల్ కో-ఆర్డినేషన్ కమిటీ ఆఫ్ పెన్షనర్స్ అసోసియేషన్ కూడా ఉన్నాయి. రైల్వేతో పాటు పలు రంగాల్లో మొత్తం 33 లక్షల మందికి పైగా ఉద్యోగులు సమ్మెకు దిగనున్నట్టు మిశ్రా తెలిపారు.