: పండంటి పాపకు జన్మనిచ్చిన గాయక దంపతులు!
ప్రేమించుకుని, పెద్దల ఆశీస్సులతో ఒక్కటైన సినీ గాయక జంట హేమచంద్ర, శ్రావణ భార్గవి దంపతులకు ఈ రోజు పండంటి పాప పుట్టింది. ఈ మేరకు పాప, భార్యతో కలిసి దిగిన సెల్ఫీని హేమచంద్ర సోషల్ మీడియాలో పోస్టు చేసి, అభిమానులతో తన ఆనందాన్ని పంచుకున్నాడు. ఈ సందర్భంగా, 'పాప పుట్టింది..పాపను దీవించండి..ఇప్పుడు నేను ఇద్దరు అమ్మాయిల్ని జాగ్రత్తగా చూసుకోవాలి' అంటూ వ్యాఖ్యను జతచేశాడు. దీంతో అభిమానులు ఆ దంపతులకు శుభాకాంక్షలు చెబుతూ బుజ్జాయికి ఆశీస్సులు అందజేస్తున్నారు.