: గవర్నర్ నరసింహన్‌తో దత్తాత్రేయ భేటీ


గవర్నర్ నరసింహన్‌తో ఈరోజు కేంద్ర‌మంత్రి, భాజ‌పా నేత‌ బండారు దత్తాత్రేయ భేటీ అయ్యారు. హైకోర్టు విభ‌జ‌న, తెలంగాణ న్యాయ‌వాదుల ఆందోళ‌నపై న‌ర‌సింహ‌న్‌తో ద‌త్తాత్రేయ చ‌ర్చిస్తున్నారు. న్యాయ‌మూర్తులు, ఉద్యోగుల స‌స్పెన్ష‌న్ ప‌ట్ల తెలంగాణ న్యాయ‌వాదులు తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తోన్న నేప‌థ్యంలో తీసుకోవాల్సిన త‌దుప‌రి చ‌ర్య‌ల‌పై గ‌వ‌ర్న‌ర్‌తో ద‌త్త‌న్న చ‌ర్చిస్తున్నారు. ఈరోజు ఉద‌యం గ‌వ‌ర్న‌ర్‌తో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా భేటీ అయిన విష‌యం తెలిసిందే. మ‌రోవైపు త‌మ సమ‌స్య‌ని తొంద‌ర‌గా ప‌రిష్క‌రించ‌క‌పోతే ఢిల్లీలో పెద్ద ఎత్తున ఆందోళ‌న‌కు దిగుతామ‌ని తెలంగాణ న్యాయ‌వాదులు హెచ్చ‌రిస్తున్నారు.

  • Loading...

More Telugu News