: ఏపీలో చంద్రబాబు కొత్తగా చేసిందేమీ లేదు: రఘువీరారెడ్డి
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి ప్రభుత్వంపై ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి విమర్శలు గుప్పించారు. ఈరోజు అనంతపురం జిల్లాలో పర్యటిస్తోన్న ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని ఆరోపించారు. లంచం ఇస్తేనే జన్మభూమి కమిటీల్లో పని జరుగుతోందని అన్నారు. ఏపీలో అధికారంలోకి వచ్చిన రెండేళ్లలో చంద్రబాబు కొత్తగా చేసిందేమీ లేదని ఆయన వ్యాఖ్యానించారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి మినహా చంద్రబాబు కొత్తగా ఏ అభివృద్ధీ చేసి చూపించలేదని ఆయన పేర్కొన్నారు. ప్రత్యేక హోదాపై ఏపీ సీఎంకి చిత్తశుద్ధి లేదని ఆయన విమర్శించారు.