: ఈనెల 6 నుంచి ప‌ట్టిసీమ ద్వారా నీటి విడుద‌ల: చంద్రబాబు


నీటి సంరక్ష‌ణ కోసం ఆంధ్రప్ర‌దేశ్‌లో తీసుకున్న నిర్ణ‌యాలు మంచి ఫ‌లితాలనిస్తున్నాయ‌ని ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు అన్నారు. ఈరోజు ఆయన విజయవాడలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ప్ర‌తీ గ్రామంలో వంద పంట‌కుంట‌లు తవ్వాలని పిలుపునిచ్చారు. గోదావ‌రి నీరు వృథాగా సముద్రంలోకి వెళుతోందని, నీటిని సద్వినియోగం చేసుకునేందుకు ప్ర‌య‌త్నం చేస్తున్నామ‌ని ఆయ‌న అన్నారు. ఈనెల 6 నుంచి ప‌ట్టిసీమ ద్వారా నీరు విడుద‌ల చేస్తామ‌ని ఆయ‌న పేర్కొన్నారు. ‘వాట‌ర్ ఆడిటింగ్ చేస్తాం’ అని ఆయ‌న పేర్కొన్నారు. త్వ‌ర‌లో కృష్ణా-పెన్నా న‌దుల‌ను అనుసంధానిస్తామ‌ని ఆయ‌న తెలిపారు. 50 ల‌క్ష‌ల ఎక‌రాల‌కు బిందు సేద్యం ద్వారా నీరు అందిస్తామ‌న్నారు. విద్యుత్ స‌బ్సిడీకి రూ.5500 కోట్లు ఖ‌ర్చు పెడుతున్నట్లు ఆయ‌న పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News