: వాట్స్ యాప్ కారణంగా ఫేస్ బుక్ కు షాకిచ్చిన బ్రెజిల్!


వాట్స్ యాప్ కారణంగా ఫేస్ బుక్ కు బ్రెజిల్ షాకిచ్చింది. బ్రెజిల్ లో నమోదైన అంతర్జాతీయ డ్రగ్స్ రవాణా కేసుకు సంబంధించిన నేరగాళ్లు వాట్స్ యాప్ ద్వారానే సంప్రదింపులు జరిపారని, వారి సంభాషణల వివరాలు కావాలంటూ కొంత కాలంగా వాట్స్ యాప్ ను బ్రెజిల్ పోలీసులు కోరుతున్నారు. వినతులు పట్టించుకోకపోవడంతో నోటీసులు కూడా పంపారు. ఈ కేసు దర్యాప్తులో సదరు సమాచారం చాలా కీలకమని కూడా వారు నోటీసులో పేర్కొన్నారు. అయితే వినియోగదారుల భద్రత పేరుతో నేరగాళ్ల సంభాషణలు తెలియజేసేందుకు వాట్స్ యాప్ అంగీకరించలేదు. దీంతో ఆగ్రహించిన బ్రెజిల్ గత మేలో మూడుసార్లు వాట్స్ యాప్ ను పూర్తిగా నిలిపేశారు. అయినప్పటికీ తమకు అవసరమైన సమాచారం ఇచ్చేందుకు వాట్స్ యాప్ అంగీకరించకపోవడంతో ఫేస్ బుక్ కు చెందిన 60 లక్షల డాలర్ల నిధులను ఫ్రీజ్ చేశామని తెలిపారు. కాగా, వాట్స్ యాప్, ఫేస్ బుక్ కు అనుబంధ సంస్థ అన్న సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News