: కారుని ఢీ కొన్న టిప్పర్.. కారులో ఇరుక్కుపోయి 6 గంటలు అవస్థలు పడ్డ ఇద్దరు వ్యక్తులు
కర్ణాటక రాజధాని బెంగళూరులోని శివానంద సర్కిల్ దగ్గర ఈరోజు ప్రమాదం జరిగింది. ఓ కారుని టిప్పర్ ఢీ కొట్టింది. టిప్పర్ ముందు భాగం కింద కారు ఇరుక్కుపోయింది. దీంతో కారు పూర్తిగా దెబ్బతింది. కారులో ప్రయాణిస్తోన్న ఇద్దరు వ్యక్తులు దానిలోనే ఇరుక్కుపోయి నరకయాతన అనుభవించారు. కారులో నుంచి వారిని బయటకు తీసేందుకు పోలీసులు, స్థానికులు తీవ్రంగా శ్రమించారు. ఆరుగంటల పాటు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగింది. కారు డోర్లను, పైభాగాన్ని తొలగించి ఎట్టకేలకు వారిరువురినీ బయటకు తీశారు. తీవ్రగాయాలు కావడంతో వారిని దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు.