: రెండు గంటలు ఇబ్బంది పెట్టి అందుబాటులోకి వచ్చిన ఐడియా సిగ్నల్స్!


భాగ్యనగరి హైదరాబాదు సహా తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా మూగబోయిన ఐడియా సెల్ ఫోన్స్ మళ్లీ మోగడం ప్రారంభించాయి. నేటి ఉదయం ఉన్నట్టుండి ఐడియా సెల్యులార్ నెట్ వర్క్ కుప్పకూలిన నేపథ్యంలో రెండు రాష్ట్రాల పరిధిలోని ఐడియా ఫోన్లు మూగబోయిన సంగతి తెలిసిందే. ఏమైందో తెలుసుకుందామని యత్నించిన వినియోగదారులకు కస్టమర్ కేర్ సెంటర్లు కూడా అందుబాటులోకి రాలేదు. ఈ నేపథ్యంలో వినియోగదారులు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. పరిస్థితిని అంచనా వేసిన ఐడియా సెల్యులార్ యాజమాన్యం రంగంలోకి దిగిపోయింది. యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టి నెట్ వర్క్ కుప్పకూలడానికి గల కారణాలను కనుగొని దానిని సవరించింది. దీంతో దాదాపు 2 గంటల పాటు కనిపించకుండాపోయిన సిగ్నల్స్ మళ్లీ సెల్ ఫోన్లలో ప్రత్యక్షమయ్యాయి. వెరసి రెండు గంటల ఇబ్బంది తర్వాత ఐడియా సెల్యులార్ వినియోగదారులు తిరిగి తన పనిలో పడిపోయారు.

  • Loading...

More Telugu News