: పనితీరు బాగోలేదు.. వైద్యశాల సిబ్బందిపై కామినేని ఆగ్రహం
ప్రకాశం జిల్లా చీరాలలోని ప్రాంతీయ వైద్యశాలను ఈరోజు ఆంధ్రప్రదేశ్ వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ తనిఖీ చేశారు. ఎన్టీఆర్ ఉచిత వైద్య సేవలకు సంబంధించి బోర్డు లేకపోవడంపై అక్కడి సిబ్బందిపై ఆయన మండిపడ్డారు. వైద్యసేవలపై బోర్డు లేకపోతే ప్రజలకి ఆ సేవల వినియోగం గురించి ఎలా తెలుస్తుందని ఆయన ప్రశ్నించారు. అనంతరం ఆంధ్రప్రదేశ్ లోని అన్ని వైద్యశాలల్లో ఎన్టీఆర్ వైద్య సేవల బోర్డులు ఉండాలని ఆయన అధికారులను ఆదేశించారు. చీరాలలోని ప్రాంతీయ వైద్యశాలలో సిబ్బంది పనితీరు బాగోలేదని మంత్రి కామినేనికి ఎమ్మెల్యే కృష్ణమోహన్ ఫిర్యాదు చేశారు.