: ఢాకా దాడి ఎవరి పని?... తమ పనేనని ఐఎస్, ఆల్ కాయిదా వేర్వేరు ప్రకటనలు!


బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో నిన్న రాత్రి జరిగిన ఉగ్రవాద దాడి ఎవరి పని? ఈ దాడికి పాల్పడింది తామేనని ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా(ఐఎస్ఐఎస్) తో పాటు ఆల్ కాయిదా కూడా వేర్వేరుగా ప్రకటనలు విడుదల చేశాయి. ఢాకాలో భీకర దాడి చేసి 20 మందిని చంపేశామని ఐఎస్ ఉగ్రవాదులు ప్రకటించుకున్నారు. ఈ మేరకు ‘అమాక్ న్యూస్ ఏజెన్సీ’కి ఐఎస్ ఉగ్రవాదుల నుంచి ఓ ప్రకటన చేరింది. దాడి జరిగిన కొన్ని గంటల్లోనే ఐఎస్ నుంచి ఈ ప్రకటన వెలువడింది. అయితే ఆ వెనువెంటనే ఆల్ కాయిదా ఉగ్రవాద సంస్థ నుంచి కూడా మరో ప్రకటన వెలువడింది. ఢాకాలో విరుచుకుపడింది తామేనని ఆ సంస్థ పేర్కొంది.

  • Loading...

More Telugu News