: పోలీసులను చూసి బ్లేడ్ తో గొంతు కోసుకున్న ప్రేమోన్మాది!... ఆసుపత్రిలో టెక్కీ స్వాతి హంతకుడు!
తమిళనాడు రాజధాని చెన్నైలో పట్టపగలే దారుణంగా హత్యకు గురైన సాఫ్ట్ వేర్ ఉద్యోగి స్వాతి కేసులో పోలీసులు పురోగతి సాధించారు. రైల్వే స్టేషన్ లో స్వాతితో గొడవకు దిగి, ఆ తర్వాత కత్తితో ఆమెపై దాడి చేసిన నిందితుడిని రామ్ కుమార్ గా పోలీసులు గుర్తించారు. తమిళనాడులోని తిరునల్వేలిలో అతడు ఇంజినీర్ గా పనిచేస్తున్నట్లు కనుగొన్న పోలీసులు అతడిని అరెస్ట్ చేసేందుకు నిన్న రాత్రి అక్కడికి వెళ్లారు. అయితే పోలీసులను చూడగానే రామ్ కుమార్ ఆత్మహత్యాయత్నం చేశాడు. బ్లేడుతో అతడు తన గొంతు కోసుకున్నాడు. దీంతో పోలీసులు వెనువెంటనే అతడిని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతడు చికిత్స పొందుతున్నాడు.