: ఆ ఇంట్లో డబ్బు బకెట్లు చూసి నిర్ఘాంతపోయిన పోలీసులు!


గార్డెన్ సామాన్ల వ్యాపారం పేరిట మాదక ద్రవ్యాలను విక్రయిస్తున్నారనే సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులకు దిమ్మ తిరిగిపోయింది. సదరు వ్యాపారి ఇంట్లో తనిఖీలకు వెళ్లిన సమయంలో అటకపై ఉన్న బకెట్ల నిండా డబ్బు ఉండటంతో పోలీసులు ఆశ్చర్యపోయారు. ఈ సంఘటన ఫ్లోరిడాలోని మియామీలో జరిగింది. గార్డెన్ వస్తువుల వ్యాపారి లూయిస్ హెర్నాండెజ్ గాంజలెజ్ ఇంట్లో పోలీసులు తనిఖీ చేస్తుండగా, అటకపై ఉన్న 24 బకెట్ లు వారి కంట పడ్డాయి. అక్రమ వ్యాపారంతో సంపాదించిన సొమ్ము సుమారు 20 మిలియన్ డాలర్లును ఆ బకెట్లలో దాచిపెట్టాడు. ఆ సొమ్ముతో పాటు అత్యంత ఖరీదైన ఒక తుపాకీ, కొన్ని మాదక ద్రవ్యాలు కూడా ఆ బకెట్లలో ఉండటంతో పోలీసులు షాక్ కు గురయ్యారు. వ్యాపారి గాంజలెజ్ తో పాటు ఆయన సోదరి 32 సంవత్సరాల సల్మా గాంజలెజ్ ను కూడా అరెస్టు చేశారు. డబ్బు బకెట్లను, డ్రగ్స్ ను, ఆయుధాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను కోర్టులో ప్రవేశపెట్టారు.

  • Loading...

More Telugu News