: అమరావతి నిర్మాణానికి కేంద్రం ఇక 1,500 కోట్లు మాత్రమే ఇస్తానంటోంది: చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ ప్రతిష్ఠాత్మక రాజధాని అమరావతి నిర్మాణానికి కేవలం 2,500 కోట్ల రూపాయలు మాత్రమే ఇస్తామని కేంద్ర ప్రభుత్వం చెబుతోందని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తెలిపారు. విజయవాడలో ఆయన మాట్లాడుతూ, ఆ 2,500 కోట్ల రూపాయల్లో ఇంకా 1,500 కోట్ల రూపాయలు మాత్రమే విడుదల చేస్తామని చెప్పిందని అన్నారు. గతంలో విజయవాడ, గుంటూరు నగరాలకు ఇచ్చిన 1000 కోట్ల రూపాయల నిధులు అమరావతి నిర్మాణానికి ఇచ్చిన నిధులేనని కేంద్ర ప్రభుత్వం లెక్క చెప్పిందని ఆయన చెప్పారు. కేంద్రం ఇస్తామంటున్న నిధులతో అండర్ గ్రౌండ్ కేబుల్ వ్యవస్థ కూడా పూర్తి కాదని ఆయన చెప్పారు. తెలివితేటలు, సాంకేతక సహకారంతో రాజధానిని నిర్మించుకుంటామని ఆయన తెలిపారు. అయినప్పటికీ కేంద్రాన్ని నిధులు అడగడం ఆపమని ఆయన చెప్పారు.