: బరువు పెరిగిపోతున్న ఉత్తర కొరియా నేత కిమ్ జోంగ్!
ఉత్తర కొరియా నేత కిమ్ జోంగ్ ఉన్ బరువు విపరీతంగా పెరిగిపోతున్నారట. ఈ విషయాన్ని దక్షిణ కొరియాలోని స్పై ఏజెన్సీ పేర్కొంది. కిమ్ జోంగ్ అధికారం చేపట్టకముందుకు, ఇప్పటికీ చూస్తే సుమారు నలభై కిలోల బరువు పెరిగిపోయారు. 2012లో అధికారం చేపట్టినప్పుడు కిమ్ జోంగ్ 90 కిలోలు ఉండగా, 2014లో 120 కిలోలు, ప్రస్తుతం 130 కిలోలు ఉన్నారు. కిమ్ జోంగ్ బరువు పెరగడానికి కారణం ఆయన ఆహారపు అలవాట్లేనని స్సై ఏజెన్సీ చెబుతోంది. అంతేకాకుండా నిద్రలేమి, తన భద్రత గురించిన మనో వ్యధతో ఆయన బాధపడుతున్నట్లు పార్లమెంటరీ కమిటీకి ఆ దేశ ఇంటెలిజెన్స్ సర్వీస్ ఇచ్చిన ఒక రహస్య నివేదిక చెబుతోంది. కాగా, కిమ్ జోంగ్ పై అధికార పార్టీ చట్టసభ సభ్యుడు లీ చియోల్ వూ మీడియాతో మాట్లాడుతూ, అధికారం ఎక్కడ చేజారుతుందోనన్న బెంగ, భద్రతా దళాలు ఎప్పుడు తిరుగుబాటు చేస్తాయోనన్న భయానికి ఆయన గురవుతున్నారని చెప్పారు. దీనికితోడు, కిమ్ జోంగ్ చైన్ స్మోకరని, ఆ అలవాటు తన తండ్రి, తాత నుంచి ఆయన అబ్బినట్లు సమాచారం. అయితే, కిమ్ జోంగ్ తండ్రి, తాత ఇద్దరూ గుండెపోటుతోనే మరణించారు.