: ‘సారే జహాసే అచ్ఛా’ అంటున్న సచిన్


క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ప్రస్తుతం విదేశాల్లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. తను పర్యటించిన ప్రదేశాల్లో దిగిన ఫొటోలను తరచుగా పోస్ట్ చేస్తున్న సచిన్ తాజాగా మరో ఫొటో పోస్ట్ చేశాడు. ఒక ఐలాండ్ పక్కగా వెళ్తున్న సమయంలో అచ్చం భారతదేశ పటం వంటి ఆకారం అక్కడి నీటిలో కనిపించిందంటూ తన ట్వీట్ లో పేర్కొన్న సచిన్, అక్కడ దిగిన సెల్ఫీని పోస్ట్ చేశాడు. ‘సారే జహాసే అచ్ఛా హిందూస్థాన్ హమారా!’ అంటూ తన అనుభూతిని ట్వీట్ చేశాడు.

  • Loading...

More Telugu News