: హైకోర్టు విభజనపై మాకు అభ్యంతరం లేదు: కేంద్రమంత్రి సుజనా చౌదరి
విభజన చట్టంలోని సమస్యలను పరిష్కరించాల్సిన బాధ్యత కేంద్ర హోంశాఖదేనని కేంద్రమంత్రి సుజనా చౌదరి అన్నారు. ఈరోజు ఢిల్లీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఇరు తెలుగు రాష్ట్రాలకు నష్టం కలగకుండా సమస్యలను పరిష్కరించాలని కోరారు. ‘హైకోర్టు విభజనపై మాకు అభ్యంతరం లేదు’ అని ఆయన పేర్కొన్నారు. హైకోర్టు నిర్మాణానికి కేటాయించిన స్థలాన్ని కేంద్ర బృందం పరిశీలించిందని ఆయన చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌కి హైకోర్టు ఏర్పాటుపై ఏపీ ప్రభుత్వం బాధ్యతగానే ఉందని అన్నారు. అమరావతిలో ఇప్పటికే స్థలం కేటాయించామని, ప్రత్యేక హోదాపై జైట్లీతో చర్చించామని ఆయన పేర్కొన్నారు.