: ‘కబాలి’ ఫ్లయిట్ డిజైనింగ్ కు నెలరోజులు పట్టింది


సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన తాజా చిత్రం 'కబాలి' విడుదలకు సిద్ధమవుతున్న నేపథ్యంలో అఫిషియల్ ఎయిర్ లైన్ పార్టనర్ ఎయిర్ ఏసియా ఇండియా వినూత్న ప్రచారానికి శ్రీకారం చుట్టింది. ‘కబాలి’ స్పెషల్ ఫ్లయిట్ ను రూపొందించింది. ఈరోజు నుంచి ప్రారంభం కానున్న ఈ స్పెషల్ ఫ్లయిట్ డిజైనింగ్ వెనుక శ్రమ గురించి ఎయిర్ ఏసియా ప్రతినిధి ఈ సందర్భంగా వివరించారు. ఫ్లయిట్ పై ‘కబాలి’ పోస్టర్ ను ఏర్పాటు చేయడానికి దాదాపు నెలరోజుల సమయం పట్టిందని, కేవలం ఒకే ఒక్క వ్యక్తి ప్రతిభకు నిదర్శనం ఈ డిజైనింగ్ అని చెప్పారు. కబాలి సినిమా రిలీజ్ తర్వాత కూడా ఈ స్పెషల్ ఫ్లయిట్ ఇలాగే కొనసాగుతుందని చెప్పారు. ఈ ప్రత్యేక ఫ్లయిట్ ను రూపొందించడానికి ముందు బృందంలోని సభ్యులు రజనీ కాంత్ ను కలిసి ఆయనతో మాట్లాడారని చెప్పారు. బెంగళూరు, న్యూఢిల్లీ, గోవా, పుణె, జైపూర్, వైజాగ్ లాంటి పలు నగరాలకు ‘కబాలి’ ఫ్లయిట్ సేవలందించనుంది.

  • Loading...

More Telugu News