: తెలంగాణ న్యాయవాదులు బెదిరిస్తున్నారు: ఏపీ న్యాయవాదుల ఫిర్యాదు
వరంగల్‌లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన న్యాయమూర్తిపై దాడి జరపడమేంటని నిన్న ఆగ్రహం వ్యక్తం చేసిన ఆంధ్రప్రదేశ్ న్యాయవాదుల సంఘం ఈరోజు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి దిలిప్ బాబాసాహెబ్ బోస్లేని కలిసింది. తెలంగాణ న్యాయాధికారుల నిరసనలపై ఆందోళన వ్యక్తం చేసింది. తెలంగాణ న్యాయవాదులు బెదిరింపులకు పాల్పడుతున్నారని ఏపీ న్యాయవాదులు చెప్పారు. ‘న్యాయ పరిపాలనపై గతంలో ఎన్నడూ దాడి జరగలేదు’ అని పేర్కొన్నారు. తెలంగాణలో పనిచేసే ఆంధ్రప్రదేశ్ న్యాయాధికారుల మనోభావాలను దెబ్బతీస్తున్నారని అన్నారు. తెలంగాణలో పనిచేసే ఏపీ న్యాయాధికారుల్లో స్థైర్యం పెంచేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.