: మేము ఐఎస్ఐఎస్‌కి వ్య‌తిరేకం: అస‌దుద్దీన్‌ ఓవైసీ


ఇస్లామిక్ స్టేట్ కు వ్య‌తిరేకంగా వ్యాఖ్య‌లు చేసి ఎంఐఎం పార్టీ అధినేత అసదుద్దీన్ ఓవైసీ గ‌తంలో ముష్క‌రుల నుంచి బెదిరింపులు ఎదుర్కున్న విష‌యం తెలిసిందే. హైదరాబాద్‌లో ఉగ్ర‌కుట్ర బ‌య‌ట‌ప‌డిన నేప‌థ్యంలో ఈరోజు ఇస్లామిక్ స్టేట్ ఉగ్ర‌వాదుల అంశంలో ఆయ‌న మ‌రోసారి స్పందించారు. ఈరోజు హైద‌రాబాద్‌లో ఆయ‌న మాట్లాడుతూ.. తాము ఐఎస్ఐఎస్‌కి వ్య‌తిరేక‌మ‌ని పేర్కొన్నారు. దాన్ని అంత‌మొందించాల్సిన అవ‌స‌రం ఉంద‌ని ఆయ‌న అన్నారు. ముష్క‌రుల‌ను మిల‌ట‌రీ ద‌ళాలు అంత‌మొందించాల‌ని ఆయ‌న సూచించారు. ఐఎస్ఐఎస్ భావ‌జాలాన్ని పూర్తిగా రూపుమాపాల‌ని ఆయ‌న వ్యాఖ్యానించారు. ఇస్లామిక్ స్టేట్ అంశంపై తాము మొద‌టి నుంచి ఇదే అంశాన్ని ప్ర‌స్తావిస్తున్నామ‌ని ఆయ‌న పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News