: వాద్రాకు మరో దెబ్బ!... ‘స్కైలైట్’కు ఈడీ మరో నోటీసు!


కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రాకు మరో ఎదురు దెబ్బ తగిలింది. రాజస్థాన్ లోని బికనీర్ లో భూ వివాదానికి సంబంధించి వాద్రాకు చెందిన సంస్థ స్కైలైట్ హాస్పిటాలిటీ ప్రైవేట్ లిమిటెడ్ కు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మరో నోటీసు జారీ చేసింది. ఇప్పటికే ఓ మారు ఈ సంస్థకు నోటీసులు జారీ చేసిన ఈడీ అధికారులు నేటి ఉదయం మరో నోటీసు జారీ చేశారు. భూ ఆక్రమణ, మనీ లాండరింగ్ చట్టాల కింద నోటీసులు జారీ చేసింది. గతంలో జారీ చేసిన నోటీసులను బేఖాతరు చేసిన స్కైలైట్...తాము కోరిన మేరకు సమాచారాన్ని అందజేయని కారణంగానే తాజా నోటీసులు జారీ చేసినట్లు ఈడీ అధికారులు చెప్పారు.

  • Loading...

More Telugu News