: జగన్ అక్రమాస్తులు ఇంకా బయటపడతాయి: చిన రాజప్ప
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఆస్తులను తాజాగా ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అటాచ్ చేసిన అంశంపై ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి చినరాజప్ప స్పందించారు. ఈరోజు కాకినాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జగన్ అక్రమాస్తులు ఇంకా బయటపడతాయని అన్నారు. ఇప్పటి వరకు ఈడీ అటాచ్ చేసిన జగన్ ఆస్తులు రూ.46 వేల కోట్లని ఆయన అన్నారు. జగన్‌కి ప్రతిపక్ష హోదా లేదని ఆయన వ్యాఖ్యానించారు. వైసీపీ నేతలు జగన్ తీరుని గ్రహించాలని అన్నారు. గోదావరి అంత్యపుష్కరాల నేపథ్యంలో భక్తులకు కల్పించాల్సిన సౌకర్యాలపై ప్రభుత్వం దృష్టి పెట్టిందని, మెరుగైన సౌకర్యాలు కల్పిస్తామని చినరాజప్ప పేర్కొన్నారు. ఏపీ రైతుల సంక్షేమమే ధ్యేయంగా తమ ప్రభుత్వం పనిచేస్తోందని ఆయన అన్నారు.