: తెలంగాణ ప్రత్యేక దేశమేమీ కాదు!: కేసీఆర్ పై అమలాపురం ఎంపీ ధ్వజం!
టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావుపై టీడీపీకి చెందిన ఏపీ పార్లమెంటు సభ్యుడు ఫైరయ్యారు. తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ ఓ ప్రత్యేక దేశంలా పరిగణిస్తున్నారని తూర్పు గోదావరి జిల్లా అమలాపురం ఎంపీ రవీంద్ర ధ్వజమెత్తారు. అమలాపురంలో కొద్దిసేపటి క్రితం మీడియాతో మాట్లాడిన సందర్భంగా రవీంద్ర ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టులో చోటుచేసుకున్న వివాదంపై సీఎం హోదాలో ఉన్న కేసీఆర్... ఆ హోదాకు తగ్గట్టుగా వ్యవహరించలేదని కూడా రవీంద్ర ఆరోపించారు. ఏపీ ప్రజలపై కేసీఆర్ ఇంకా విషం చిమ్ముతున్నారని, ఇంతకంటే దుర్మార్గమేముంటుందని కూడా ఆయన విమర్శించారు.