: హైదరాబాద్కు భారీగా తరలివస్తోన్న తెలంగాణ న్యాయవాదులు
హైకోర్టును వెంటనే విభజించాలని, తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ న్యాయవాదులు ఈరోజు చలో హైదరాబాద్కి పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. దీంతో హైదరాబాద్ ఇందిరాపార్క్ వద్దకు తెలంగాణలోని పలు జిల్లాల నుంచి భారీగా న్యాయవాదులు చేరుకుంటున్నారు. న్యాయవాదులు భారీగా తరలివస్తోన్న నేపథ్యంలో ఇందిరా పార్క్ పరిసర ప్రాంతాల్లో పోలీసు బలగాలు భారీగా మోహరించాయి. హైదరాబాద్లో ఉన్న హైకోర్టు ఉమ్మడి హైకోర్టులా లేదని ఆంధ్రప్రదేశ్ హైకోర్టులా ఉందని తెలంగాణ న్యాయవాదులు మీడియాతో మాట్లాడుతూ ఆగ్రహం వ్యక్తం చేశారు. సమస్య తొందరగా పరిష్కరించాలని డిమాండ్ చేశారు.