: ఐఎస్ టార్గెట్ గా బీజేపీ నేత రాజా సింగ్!... గోషా మహల్ ఎమ్మెల్యే హత్యకు పథకం!
భాగ్యనగరిలో భారీ విధ్వంసం సృష్టించేందుకు పక్కా ప్లాన్ తో నగరంలోకి ఎంటరైన ఐఎస్ఐఎస్ ఉగ్రవాదుల టార్గెట్ లిస్ట్ చూసిన పోలీసులకు ముచ్చెమటలు పట్టాయి. నగరంలోని షాపింగ్ మాల్స్ తో పాటు ఆలయాల్లో విధ్వంసానికి పథక రచన చేసిన ఉగ్రవాదులు... గోషా మహల్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్న బీజేపీ కీలక నేత రాజా సింగ్ ను హత్య చేసేందుకు కూడా పక్కాగా ప్లాన్ వేసినట్లు సమాచారం. అరెస్టైన ఉగ్రవాదులను విచారించిన సందర్భంగా ఈ విషయం వెలుగుచూసింది. హనుమాన్ శోభాయాత్ర వంటి హిందూ అనుకూల కార్యక్రమాల్లో కీలకంగా వ్యవహరించే రాజాసింగ్ ను హత్య చేసేందుకు నిర్ణయించుకున్న ఉగ్రవాదులు ఆయన ఇంటి సమీపంలో ఇప్పటికే రెక్కీ కూడా నిర్వహించారట. అయితే దాడులకు వ్యూహ రచన చేసిన మూడు రోజుల ముందుగానే ఉగ్రవాదులను పోలీసులు పట్టేయడంతో పెద్ద ప్రమాదమే తప్పింది.