: రజనీకాంత్ సింహంలా గర్జించారన్న లైకా ప్రొడక్షన్ క్రియేటివ్ హెడ్


తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ ఆరోగ్యంపై వస్తున్న వదంతుల్లో ఎటువంటి వాస్తవం లేదంటూ ఇటీవల ఆయన సోదరుడు సత్యనారాయణ పేర్కొన్న విషయం తెలిసిందే. తాజాగా, లైకా ప్రొడక్షన్స్ క్రియేటివ్ హెడ్ రాజు మహాలింగం చేసిన ట్వీట్ లో రజనీకాంత్ ఆరోగ్యం బాగుందని పేర్కొన్నారు. ఈరోజు ఉదయం సూపర్ స్టార్ రజనీకాంత్ తనకు ఫోన్ కాల్ చేసి సింహంలా గర్జించారని, ఆయన ఆరోగ్యం బాగుందని, దీంతో ఆయన ఆరోగ్యంపై వస్తున్న వదంతులకు తెరపడుతుందని ఆశిస్తున్నానని తన ట్వీట్ లో పేర్కొన్నారు. రజనీకాంత్ హీరోగా నటిస్తున్న ‘2.0’ చిత్ర్రాన్ని లైకా ప్రొడక్షన్స్ పతాకంపై తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే.

  • Loading...

More Telugu News