: జగన్! అమరావతికి రా... మంచి ఇల్లు కట్టిస్తా: కేఈ బంపర్ ఆఫర్
వైఎస్సార్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి బంపర్ ఆఫర్ ఇచ్చారు. ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ జగన్ కు చెందిన లోటస్ పాండ్, బెంగళూరులోని మంత్రి టవర్స్ ను అటాచ్ చేయడంతో, ఇంకా జగన్ రాష్ట్రానికి దూరంగా ఉండాల్సిన అవసరం లేదని అన్నారు. కర్నూలులో ఆయన మాట్లాడుతూ, జగన్ సొంత రాష్ట్రానికి రావాల్సిన సమయం ఆసన్నమైందని ఆయన చెప్పారు. జగన్ వస్తే అమరావతిలో ఇల్లు కట్టించి ఇస్తామని ఆయన చెప్పారు. ప్రతిపక్ష నేతకు నివాసం ఇవ్వడానికి తమ ప్రభుత్వం సంశయించదని ఆయన తెలిపారు.