: అమెరికా ఎయిర్ ఫోర్స్ బేస్ లోకి ప్రవేశించిన సాయుధుడు
అమెరికా ఎయిర్ ఫోర్స్ బేస్ లోకి ఒక సాయుధుడు ప్రవేశించడంతో అక్కడి బలగాలు అప్రమత్తమయ్యాయి. మేరీలాండ్ లోని ఆండ్రూస్ ఎయిర్ ఫోర్స్ బేస్ లోని ఆసుపత్రి వద్ద సాయుధుడు కనపడినట్లు సమాచారం. దీంతో, బేస్ లోని అన్ని విభాగాల వారు అప్రమత్తంగా ఉండాలని సంబంధిత అధికారులు హెచ్చరించారు. సాయుధుడిని హతమార్చేందుకు బలగాలను రంగంలోకి దింపారు.