: నేల ఈనిందా.. ఆకాశానికి చిల్లులు పడ్డాయా..?
బాబు పాదయాత్ర ముగింపు సభకు హాజరైన అశేష ప్రజానీకాన్ని చూసిన నందమూరి బాలకృష్ణ ఉద్వేగం పట్టలేకపోయారు. నేల ఈనిందా? ఆకాశానికి చిల్లులు పడ్డాయా? అన్నట్టు సభకు భారీ ఎత్తున హాజరయ్యారని పేర్కొన్నారు. ఉప్పెనలా పోటెత్తిన టీడీపీ కార్యకర్తలకు అభినందనలు తెలిపిన బాలయ్య.. తన ఊపిరి, తన ప్రాణమైన అభిమానులకు శుభాభినందనలు తెలిపారు. ఇక ఎన్టీఆర్ ను స్మరించుకుంటూ, తెలుగువారి ఆత్మగౌరవాన్ని నలుమూలలా చాటిన యుగపురుషుడు ఎన్టీఆర్ అని వ్యాఖ్యానించారు. చంద్రబాబు నాయకత్వంలో తెలుగు వారికి ఉజ్వల భవిష్యత్తు ఉందని బాలయ్య అన్నారు.