: అన్ని హిట్లు చూసి... ఒక ఫ్లాప్ ఇవ్వమని దేవుడ్ని కోరుకున్నాను: కోదండరామిరెడ్డి


తాను దర్శకత్వం వహించిన సుమారు 16 చిత్రాలు వరుసగా సక్సెస్ అయ్యాయని, ఆ సందర్భంలో తన ఇంటి ముందు ప్రొడ్యూసర్లు క్యూ కట్టేవారని, ఇవన్నీ చూసి ఒక్క ఫ్లాప్ ఇవ్వమని భగవంతుడిని కోరుకున్నానని ప్రముఖ దర్శకుడు కోదండరామిరెడ్డి తన పాత జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు. ‘1980 లలో వరుసగా ఇన్ని చిత్రాలు విజయవంతమై రికార్డు సృష్టించాయి. ఆ సందర్భంలో ప్రొడ్యూసర్లు మా ఇంటి ముందు బారులు తీరడం, డబ్బులు వ్యవహారం... ఇదంతా చూసి దేవుడా.. నన్ను భూమిపై నడవనివ్వడం లేదు, ఆకాశంలో పయనిస్తున్నట్లుంది నాకు. ఒక్కసారి, భూమిపై నడిచేలా చేయి. ఒక్క ఫ్లాప్ ఇయ్యి. అలా ఇస్తే నాపై ఒత్తిడి తగ్గుతుంది, అంటూ దేవుడిని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. అంతలా కోరుకున్నానంటే నేను ఎంతటి ఒత్తిడి అనుభవించానో అర్థం చేసుకోవచ్చు’ అని కోదండరామిరెడ్డి చెప్పారు.

  • Loading...

More Telugu News