: షాకింగ్ న్యూస్... ఉగ్రవాదులు అరెస్టు కాకుంటే, ఈ శనివారం హైదరాబాదు పేలుళ్లతో దద్దరిల్లేది!


ఎన్ఐఏ అధికారుల విచారణలో దిగ్భ్రాంతి కలిగించే వాస్తవాలు వెలుగు చూశాయి. ఎన్ఐఏ అధికారులు ఏమాత్రం ఆలస్యం చేసినా కొంప కొల్లేరైపోయేది. హైదరాబాదులో పట్టుబడిన ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు ఈ శనివారం హైదరాబాదులోని మూడు ప్రాంతాల్లో బాంబు పేలుళ్లకు కుట్రపన్నినట్టు గుర్తించారు. బాంబు పేలుళ్లకు రద్దీగా ఉన్న మూడు కీలక ప్రాంతాలను ఎంపిక చేసుకున్నట్టు కూడా గుర్తించారు. దీంతో అధికారులు షాక్ కు గురయ్యారు. ఈ విషయం వెలుగు చూడడంతో హైదరాబాదీలు కూడా బెంబేలెత్తిపోతున్నారు. ముస్లింల పవిత్ర రంజాన్ మాసంలో హిందూ దేవాలయంలో పేలుళ్లు సంభవించి వుంటే పరిస్థితులు ఎలా ఉండేవోనని సర్వత్ర ఆందోళన వ్యక్తమవుతోంది.

  • Loading...

More Telugu News