: నాంపల్లి కోర్టులో ఐఎస్ఐఎస్ తీవ్రవాదులు
హైదరాబాదులోని పాతబస్తీలో పట్టుబడిన ఐదుగురు ఐఎస్ఐఎస్ తీవ్రవాదులను ఎన్ఐఏ అధికారులు నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. ఈ సందర్భంగా వారు చేసిన ఘనకార్యాలను న్యాయస్థానానికి పూసగుచ్చినట్టు వివరించారు. సమాజానికి వారు చేయాలనుకున్న కీడును సవివరంగా తెలియజేశారు. ఈ సందర్భంగా స్లీపర్ సెల్స్ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చేపట్టకుండా రెండు వాహనాలలో భద్రతాధికారులు వారిని న్యాయస్థానంలో హాజరుపరిచారు. ఈ సందర్భంగా వారు నిందితులను తదుపరి విచారణకు ఢిల్లీకి తరలించేందుకు అనుమతినివ్వాల్సిందిగా అధికారులు న్యాయస్థానాన్ని కోరినట్టు తెలుస్తోంది.