: శంషాబాద్ విమానాశ్రయంలో హై అలర్ట్.. ముమ్మరంగా తనిఖీలు
ఉగ్రవాదులు హైదరాబాద్‌లో విధ్వంసానికి కుట్ర చేసిన నేపథ్యంలో శంషాబాద్ విమానాశ్రయంలో హై అలర్ట్ ప్రకటించారు. విమానాశ్రయంలో భద్రతా బలగాలను పెంచారు. దేశీయ, అంతర్జాతీయ టెర్మినళ్ల వద్ద ఆక్టోపస్ బలగాలు మోహరించాయి. శంషాబాద్‌కి అనుసంధానంగా ఉన్న రహదారుల వద్ద కూడా భద్రతా బలగాలు రంగంలోకి దిగాయి. విమానాశ్రయంలోకి వచ్చే వారిని క్షుణ్ణంగా తనిఖీ చేసిన తరువాతే అనుమతిస్తున్నారు. సందర్శకులను అనుమతించడం లేదు. ఐడెంటిటీ కార్డ్, టిక్కెట్లు లేనిదే విమానాశ్రయంలోకి అనుమతించబోమని భద్రతాబలగాలు చెబుతున్నాయి. అనుమానంగా కనబడుతోన్న వారిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఈరోజు నుంచి వారం రోజుల పాటు తనిఖీలు ముమ్మరంగా కొనసాగనున్నాయి.