: ‘విశాఖ’లో వృద్ధ దంపతుల ఇంటికి కన్నం!


విశాఖపట్టణంలోని అక్కయ్యపాలెంలో చోరీ జరిగింది. గత రాత్రి ఇంటికి తాళం వేసి బంధువుల ఇంటికి వెళ్లిన సందర్భంలో ఈ సంఘటన జరిగింది. నర్సింహనగర్ ద్వారకామాయి రెసిడెన్సీలో నివాసముంటున్న వృద్ధ దంపతులు గత రాత్రి ఇంటికి తాళం వేసి తమ బంధువుల ఇంటికి వెళ్లారు. ఈరోజు ఉదయం ఇంటికి వచ్చి చూడగా బీరువాలోని 18 తులాల బంగారం, 25 తులాల వెండి వస్తువులు, రూ.13 వేల నగదును దుండగులు దోచుకుపోయినట్లు గుర్తించారు. ఈ విషయమై బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్ తో కలిసి రంగంలోకి దిగిన పోలీసులు ఆధారాలు సేకరించారు.

  • Loading...

More Telugu News