: సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ ముందు రైల్వే కార్మికుల ఆందోళన
రైల్వే మజ్దూర్ యూనియన్ ఆధ్వర్యంలో సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ ముందు ఈరోజు రైల్వే కార్మికులు ఆందోళనకు దిగారు. ఏడవ వేతన సవరణ సంఘం సిఫార్సులు, కేంద్రం ప్రకటనను వ్యతిరేకిస్తున్నామని కార్మికులు చెబుతున్నారు. వేతన పెంపు విషయంలో కేంద్రం అన్యాయం చేసిందంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. న్యాయమైన వేతనాలు ఇచ్చేవరకు తమ ఆందోళనను ఆపబోమని స్పష్టం చేస్తున్నారు.