: బలవంతపు భూసేకరణ ఆపాల్సిందే: సీపీఎం తెలంగాణ కార్యదర్శి తమ్మినేని
తెలంగాణ ప్రభుత్వం చేస్తోన్న బలవంతపు భూసేకరణ ఆపాలని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం డిమాండ్ చేశారు. రేపటి నుంచి మెదక్ జిల్లాలో ఆయన పాదయాత్ర చేయనున్నారు. కొండపాక మండలం ఎర్రవల్లి నుంచి ఏటిగడ్డ కిష్టాపూర్ వరకు పాదయాత్ర కొనసాగనుంది. ఈ సందర్భంగా ఆయన ఈరోజు మీడియాతో మాట్లాడుతూ.. మల్లన్న సాగర్ భూ నిర్వాసితులకు మార్కెట్ ధరల ప్రకారం పరిహారం ఇవ్వాలని అన్నారు. నిర్వాసితులుగా మారిన వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని, నష్టపరిహారంగా భూమికి భూమి ఇవ్వాలని ఆయన వ్యాఖ్యానించారు. మల్లన్న సాగర్ భూ నిర్వాసితులపై ప్రభుత్వం ఉదాసీన ధోరణి కనబర్చొద్దని ఆయన సూచించారు.