: అభివృద్ధిని జ‌గ‌న్ అడుగ‌డుగునా అడ్డుకునే ప్ర‌య‌త్నం చేస్తున్నారు: ప‌్ర‌త్తిపాటి ఆగ్ర‌హం


వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలపై ఆంధ్ర‌ప్ర‌దేశ్ మంత్రి ప్ర‌త్తిపాటి పుల్లారావు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. రాష్ట్రాభివృద్ధి కోసం ముఖ్యమంత్రి చంద్ర‌బాబు నాయుడు తీవ్రంగా కృషి చేస్తుంటే మ‌రోవైపు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డితో పాటు ఆ పార్టీ నేత‌లు అభివృద్ధిని అడ్డుకోవడానికి అడుగడుగునా ప్ర‌య‌త్నిస్తున్నార‌ని ఆయ‌న అన్నారు. అయినా వారి ఆట‌లు సాగ‌వ‌ని, రాజ‌ధానిని అభివృద్ధి చేసి చూపిస్తామ‌ని ఆయ‌న ధీమా వ్య‌క్తం చేశారు. అమ‌రావ‌తి అభివృద్ధితో వైసీపీ భ‌విష్య‌త్ క‌నుమ‌రుగైపోతుందని ఆయ‌న జోస్యం చెప్పారు. వైసీపీ నేత‌ల‌కి రుణ‌మాఫీ అంశంపై ప్ర‌శ్నించే అధికారం లేద‌ని ఆయ‌న అన్నారు. అధిక మొత్తంలో రుణ‌మాఫీ చేసిన ఘనత చంద్రబాబు నాయుడిది మాత్రమే అని ఆయ‌న ఉద్ఘాటించారు.

  • Loading...

More Telugu News