: గణేశ్ విగ్రహాల ఎత్తు 15 అడుగులకు మించకూడదు: తెలంగాణ ప్రభుత్వ సీఎస్
మరో రెండు నెలల్లో వినాయక చవితి వేడుకలు ప్రారంభం కానున్న నేపథ్యంలో గణేశ్ విగ్రహాల ఎత్తు, ఉత్సవాల సందర్భంగా ఏర్పడే కాలుష్యం, తీసుకోవాల్సిన జాగ్రత్తలతో పాటు పలు అంశాలపై హైదరాబాద్‌లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. భాగ్యనగర్ గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజీవ్‌శర్మ మాట్లాడుతూ.. విగ్రహాల ఎత్తు అంశంలో హైకోర్టు జారీ చేసిన ఆదేశాల ప్రకారం నడుచుకోవాలని అన్నారు. 15 అడుగులకు మించి గణేశ్ విగ్రహాలు ఏర్పాటు చేయకూడదని ఆయన సూచించారు. పర్యావరణాన్ని, కాలుష్యాన్ని కాపాడుకునేందుకు మట్టి విగ్రహాల తయారీని ప్రోత్సహించాలని కోరారు. విగ్రహాలకి రసాయనాలతో కూడిన రంగులు అద్దకుండా హని కనిగించని సహజసిద్ధమైన రంగులు వాడాలని ఆయన చెప్పారు.