: మరో వివాదంలో కర్ణాటక సీఎం... సిద్దూ కాన్వాయ్ కోసం 45 నిమిషాల పాటు అంబులెన్స్ నిలిపివేత
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, కర్ణాటక సీఎం సిద్దరామయ్యను వివాదాలు చుట్టుముడుతూనే ఉన్నాయి. ఇప్పటికే పెను వివాదాల్లో చిక్కుకున్న ఆయన వాటి నుంచి బయటపడేందుకు నానా యాతన పడ్డారు. తాజాగా ఆయన కాన్వాయ్ కోసం బెంగళూరు పోలీసులు ఓ రోగిని ఆసుపత్రికి తీసుకెళుతున్న అంబులెన్స్ ను నడిరోడ్డుపై 45 నిమిషాల పాటు ఆపేశారు. ఈ విషయాన్ని సదరు అంబులెన్స్ లో ఆరోగ్యం విషమంగా ఉన్న తన తల్లిని ఆసుపత్రికి తీసుకెళుతున్న ఓ యువకుడు సోషల్ మీడియాలో వెల్లడించారు. దీంతో మరోమారు సిద్దూపై విమర్శల జడివాన మొదలైంది. ప్రజా సంఘాలతో పాటు ప్రతిపక్షాలు కూడా సీఎం వైఖరిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.