: కాంగ్రెస్ బ్యాంకు ఖాతాలను టార్గెట్ చేసిన సుబ్రహ్మణ్య స్వామి
నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ, ఆ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీలను కోర్టు మెట్లెక్కించిన బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి మరోమారు ఈ కేసుపై దృష్టి సారించనున్నారు. ఈ మేరకు కొద్దిసేపటి క్రితం ఆయన తన ట్విట్టర్ ఖాతాలో ఆసక్తికర అంశాన్ని వెల్లడించారు. సోనియా, రాహుల్ గాంధీలతో పాటు పలువురు కాంగ్రెస్ పెద్దలకు ప్రత్యక్ష ప్రమేయం ఉన్న ఈ కేసులో మరింత సమాచారం రాబట్టేందుకు కాంగ్రెస్ పార్టీ బ్యాంకు ఖాతాల పరిశీలనకు తనను అనుమతించాలని ఆయన కోరుతున్నారు. ఈ మేరకు మరో రెండు రోజుల్లో ఈ విషయంలో పాటియాల హౌజ్ కోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్నట్లు ఆయన ట్వీటారు.