: వింత వివాహం... 'సెల్ ఫోన్'ను పెళ్లాడిన యువకుడు!


అమెరికాలోని లాస్ ఏంజిలెస్ కు చెందిన ఆరన్ చెర్వెనార్ అనే యువకుడికి లాస్ వెగాస్ లోని ఓ చర్చిలో చిత్రమైన వివాహం జరిగింది. ప్రపంచంలో ఒక వివాహం ఈ తరహాలో జరగడం ఇదే తొలిసారి కావడంతో వార్తల్లో నిలిచింది. ఈ వివాహం చేసిన పాస్టర్ మైఖేల్ కూడా కొత్త అనుభూతికి లోనయ్యానని చెప్పారు. ఎన్నో జంటలకు వివాహం చేసిన తాను ఆరన్ ఒక 'సెల్ ఫోన్'ను వివాహం చేసుకుంటానని చెప్పగానే ఆశ్చర్యానికి లోనయ్యానని తెలిపారు. అయితే తన జీవితంలో స్మార్ట్ ఫోన్ ఓ భాగం అయిపోయిందని, ప్రతి నిమిషం దానితోనే ఆనందంగా గడుపుతున్నప్పుడు దానిని ఎందుకు వివాహం చేసుకోకూడదని ప్రశ్నించాడని, అతనికి లేని అభ్యంతరం తనకు ఎందుకని భావించి, అతని భావాలకు విలువనివ్వాలనే భావంతో ఆరన్ కు స్మార్ట్ ఫోన్ తో వివాహం చేయించానని ఆయన తెలిపారు. స్మార్ట్ ఫోన్ వివాహం చేసుకున్న తొలి వ్యక్తిగా ఆరన్ చెర్వెనార్ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతారు.

  • Loading...

More Telugu News