: పిల్లాడి వెంటపడ్డ క్రికెటర్లు...సోషల్ మీడియాలో వైరల్ ఫోటో


సోషల్ మీడియాలో ఓ ఫోటో వైరల్ అవుతోంది. ఓ పిల్లాడి వెంట ఇద్దరు ఆఫ్ఘన్ క్రికెటర్లు పరుగెత్తుతున్న ఈ ఫోటో వెనుక కథ అందర్నీ ఆకట్టుకుంటోంది. అఫ్గానిస్థాన్‌ క్రికెటర్లు పోలియో వ్యాక్సినేషన్‌ పై అవగాహనా కార్యక్రమం నిర్వహించారు. ఆఫ్ఘన్ నుంచి పోలియోను తరిమికొట్టాలని, అలా చేయాలంటే పిల్లలంతా పోలియో వ్యాక్సిన్లు వేసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా కొంత మంది పిల్లలకు వారు పోలియో చుక్కలు వేయించారు. అంతవరకు బాగానే ఉన్నా, ఓ పిల్లాడు, వ్యాక్సినేషన్ వరకు వచ్చేసరికి ససేమిరా అంటూ మొరాయించాడు. వాడిని ఒప్పించేందుకు ప్రయత్నించేలోపే అక్కడి నుంచి తుర్రుమన్నాడు. దీంతో వాడిని పట్టుకునేందుకు క్రికెటర్లు వెంటపట్టారు. ఈ సందర్భాన్ని అక్కడే ఉన్న మీడియా ప్రతినిధులు తమ కెమెరాల్లో బంధించి, సోషల్ మీడియాలో పెట్టేశారు. ఇక అక్కడి నుంచి ఆ ఫోటో వైరల్ అయింది.

  • Loading...

More Telugu News