: పట్టుబడ్డ అనుమానిత ఉగ్రవాదుల్లో టెక్కీ, అతని సోదరుడు!
హైదరాబాద్ లో భారీ పేలుళ్లకు కుట్ర పన్నిన పదకొండు మంది ఐఎస్ అనుమానిత ఉగ్రవాదులను జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అధికారులు ఈరోజు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. ఈ పదకొండు మందిలో ఇద్దరు అన్నదమ్ములు కూడా ఉన్నారు. ఇందులో ఒకరు సాఫ్ట్ వేర్ ఇంజనీర్ కాగా, మరొకరు కంప్యూటర్ సైన్స్ చదువుతున్న విద్యార్థి అని ఎన్ఐఏ విచారణలో తేలింది. అనుమానిత ఉగ్రవాదుల నుంచి రూ.15 లక్షల నగదు, 9 ఎంఎం పిస్టల్స్ రెండు, ఒక ఎయిర్ గన్, భారీగా పేలుడు పదార్థాలు, 3 ల్యాప్ టాప్ లు, 7 పెన్ డ్రైవ్ లు, 23 సెల్ ఫోన్లు, ఒక సీపీయూ, రెండు గ్యాస్ స్టౌలు, హీటర్ టైమర్స్, వెదర్ మీటర్, కలర్ బాటిళ్లు, మాస్కులు, గ్లౌస్ లు అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కాగా, హైదరాబాద్ లో పట్టుబడ్డ ఉగ్రవాదుల వివరాలు... మహ్మద్ ఇలియాస్ (డిగ్రీ విద్యార్థి), మహ్మద్ ఇబ్రహీం(సాఫ్ట్ వేర్ ఇంజినీర్), హబీబ్ (కంప్యూటర్ సైన్స్ విద్యార్థి), మహ్మద్ ఇర్ఫాన్ (మెకానిక్), అబ్దుల్లా బిన్ అహ్మద్ (ప్రైవేటు ఉద్యోగి), సయ్యద్ హుస్సేని (ప్రైవేటు ఉద్యోగి), ముజఫర్ హుస్సేనీ (ఎలక్ట్రీషియన్), మహ్మద్ రెహ్మాన్ (విద్యార్థి), ఎఎం అజర్ (ఇంటర్ విద్యార్థి), అర్బాజ్ అహ్మద్ (డిగ్రీ కంప్యూటర్ సైన్స్), అబ్దుల్ ఖాదిర్ ఉన్నారు.