: ఇంకో ఐదురోజుల పాటు ఏపీలో భారీ వర్షాలు: వాతావరణ శాఖ
ఆంధ్రప్రదేశ్ ప్రజలపై వరుణుడు కరుణ చూపాడు. వాతావరణ శాఖ ముందుగానే తెలిపినట్టు ఈ సారి సకాలంలో అవసరానికి మించి వర్షాలు పడేలా కనిపిస్తున్నాయి. ఏపీలో గత రెండు రోజులుగా ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాలు మరో 5 రోజుల పాటు ఏపీని వదలవని, ప్రధానంగా కోస్తా తీర ప్రాంతంలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. బంగాళా ఖాతంలో ఏర్పడ్డ అల్పపీడన ప్రభావంతో ఉత్తరాంధ్ర, గుంటూరు, కృష్ణా జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని, తీర ప్రాంత వాసులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. దీంతో రైతుల్లో ఆనందం వ్యక్తమవుతోంది.