: జగన్ సంస్థ లన్నింటినీ మూసివేయాలి: మంత్రి రావెల


వైఎస్సార్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి చెందిన రూ.749 కోట్ల ఆస్తుల ఈడీ అటాచ్ మెంట్ ను స్వాగతిస్తున్నామని ఏపీ మంత్రి రావెల కిషోర్ బాబు అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జగన్ అవినీతి సామ్రాజ్యం కుప్పకూలుతోందని, జగన్ కరుడుగట్టిన ఆర్థిక నేరస్తుడని, ఆయనకు చెందిన సంస్థలన్నింటినీ మూసివేయాలని రావెల అన్నారు. జగన్ మళ్లీ జైలుకు వెళ్లడం, పార్టీ మూసేయడం ఖాయమని అన్నారు.

  • Loading...

More Telugu News