: సుబ్రహ్మణ్య స్వామిని ఆర్థిక మంత్రిని చేయాలని చూస్తున్న ప్రధాని: సీపీఐ నారాయణ
బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామిని ఆర్థిక మంత్రిని చేయాలని ప్రధాని నరేంద్ర మోదీ చూస్తున్నారని సీపీఐ నేత నారాయణ అన్నారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, వామపక్షాల వారిని తీవ్రవాదులని మోదీ అనడం సబబు కాదన్నారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల సభ్యత్వం రద్దు చేసే చట్టం తీసుకురావాలన్న కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు వ్యాఖ్యలను ఈ సందర్భంగా ఆయన గుర్తుచేశారు. వెంకయ్య చేసిన వ్యాఖ్యలను తాను సమర్థిస్తున్నానని, చిత్తశుద్ధితో చట్టాన్ని తీసుకురావాలని నారాయణ డిమాండ్ చేశారు.