: జగన్ ‘లోటస్ పాండ్’ను, ‘సాక్షి’ టవర్స్ ను అటాచ్ చేసిన ఈడీ
వైఎస్సార్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కేసులో రూ.749 కోట్ల ఆస్తులను ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తాత్కాలిక జప్తు చేసింది. హైదరాబాద్ బంజారాహిల్స్ లోని లోటస్ పాండ్ భవనాన్ని, ‘సాక్షి’ టవర్స్, బెంగళూరులో ఖరీదైన వాణిజ్య సముదాయాన్ని, పలు కంపెనీల్లో జగన్, భారతీల షేర్లను ఈడీ అటాచ్ చేసింది. భారతి సిమెంట్స్ ఛార్జిషీటు ఆధారంగా దర్యాప్తు చేసిన ఈడీ ఈ నిర్ణయం తీసుకుంది. భారతి సిమెంట్స్ కు రూ.152 కోట్ల సున్నపురాయి నిక్షేపాలు అక్రమంగా కేటాయించినట్లుగా ఈడీ నిర్ధారించింది.